R Narayana Murthy: తెలుగు ప్రేక్షకులకు ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయన తెలుగులో కేవలం నటుడుగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, గాయకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎర్ర సైన్యం, చీమలదండు వంటి చిత్రాలకు నిర్మాతగా నటుడిగా తెలుగు ప్రేక్షకులను ఓ స్థాయిలో మెప్పించాడు.ఇక టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నారు ఆర్ నారాయణ మూర్తి.
ఇదిలా ఉంటే ఆర్ నారాయణ మూర్తి తనకున్న 12 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన తల్లి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ క్రమంలోనే తన కొడుకు పేదలకు ఉన్నది పంచిపెడుతూ ఉంటాడని తెలిపింది. అంతేకాకుండా ఆమె హైదరాబాదులో ఇల్లు కట్టుకో అని చెబితే ఆర్ నారాయణమూర్తి ఏమాత్రం చెవిన పెట్టుకోలేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆమె తన కొడుకు ఇష్టమైన కొన్ని వంటలు గురించి తెలిపింది.
ఇక ఆర్.నారాయణమూర్తి సినీరంగ ప్రవేశ విషయానికి వస్తే చిన్నతనంలోనే సినిమాలపై ఎక్కువ ఆసక్తి ని చూపి మద్రాస్ వెళ్లి పోయాడు.అక్కడ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో తిండిలేక, సరైన వసతులు లేక ఎన్నో రాత్రులు గడిపాడు. ఇన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనసులో ఏదో ఒక మూల సినిమాల్లోకి వెళ్తారనే నమ్మకం పెట్టుకొని అక్కడ అక్కడ ఉంటూ లేని రోజులు పస్తులు ఉంటూ దాసరి నారాయణ గారి ‘కృష్ణ’ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు.