Natti Kumar: థియేటర్లు బంద్ పర్సంటేజ్ విధానం గురించి ఆర్ నారాయణ మూర్తి ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. థియేటర్ల బంద్ ఎగ్జిబిటర్లు ఎవరూ చేయలేదని ఒకవేళ అలా చేసిన ఒక వారం ముందే నోటీసులు ఇవ్వాలని తెలిపారు.. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా ఆర్ నారయణ మూర్తి తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి . ఇలా ఆర్.నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై మరో నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎంతో పక్షపాతం చూపించారు. మాలాంటి చిన్న నిర్మాతలు అందరి తరపున ప్రభాస్ మహేష్ బాబు చిరు లాంటి గొప్పవారు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్తే ఆయన అవమానించి పంపించారు ఇలా చిరంజీవి ప్రభాస్ వంటి హీరోలను అవమానిస్తున్నప్పుడు లేవని నోరు నారాయణమూర్తికి ఇప్పుడెందుకు లేస్తుంది అంటూ ఘాటుగా విమర్శలు కురిపించారు. గతంలో జగన్ చేసిన అరాచకాల గురించి మీరు మాట్లాడరు? టికెట్ 500 రూపాయలు ఉన్నా మీరు మాట్లాడరు? ఆరోజు మీరు మాట్లాడి ఉంటే మేము మీకు హ్యాట్సాఫ్ చెప్పే వాళ్ళం అంటూ నట్టి కుమార్ తెలిపారు.
ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు ఎవరి చెబితే ప్రెస్ మీట్ పెట్టారో మాకు తెలుసు.ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఖండించాల్సిన అవసరం ఏముంది? థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారు, మీకు సమాధానం తెలుసా, దానికి మీరు ఆన్సర్ చెప్పారా? అంటూ నారాయణ మూర్తిని నట్టి కుమార్ ప్రశ్నిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.