Madhavan: పెళ్లైన హీరోయిన్లతో రొమాన్స్.. నాకు అస్సలు నచ్చదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్ మాధవన్

Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్, ఫాతిమా సనా షేక్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఆఫ్ జైసా కోయి. కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా రేపు అనగా జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే హీరో మాధవన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో మాధవన్ మాట్లాడుతూ పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ సీన్లు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. వయసుకు తగిన పాత్రలు చేయడం నాకు ఇష్టం. సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ ల మధ్య ప్రేమ సినిమాలతో పాటు రొమాన్స్ సన్నివేశాలు తెరకెక్కించడంలో ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. సీనియర్ హీరోలు యువకుల్లా నటిస్తూ హీరోయిన్స్ వెంటపడి తెరకెక్కించే సినిమాలు ఇప్పుడు రావడం లేదు. అలాంటి కథలను ఏ హీరో కూడా చేయడం లేదు. అటువంటి సినిమాలను ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. నేను కూడా 40 ఏళ్ళ వయసులో కాలేజీ కుర్రాడిగా 3 ఇడియట్స్ సినిమాలో నటించాను. ఆ పాత్ర నాకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ కనిపించదు.
వయసుకు తగ్గట్టుగా మాత్రమే పాత్రులను ఎంచుకోవాలి.

వయసుకు తగిన పాత్రలతో పాటుగా హీరోయిన్ ఎంపిక కూడా ఒక సినిమాకు చాలా కీలకం. పెళ్లి అయిన హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో సరిగ్గా నటించలేరు. వారితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ కాదు. మీ ముందు ఉన్న వ్యక్తి పట్ల మీకు నిజంగా కాస్త అయినా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండాలి. లేకపోతే ఆ సీన్‌ నిజం కాదని అనిపిస్తుంది. కానీ, వివాహిత హీరోయిన్లు దానిని తెరపై ఎప్పుడూ సృష్టించలేరు. పెళ్లి కావడం వల్ల వారు అప్పటికే అలాంటి అనుభూతి పొంది ఉంటారు. అలాంటప్పుడు ఆన్‌స్క్రీన్‌ పై ఆ రకమైన కెమిస్ట్రీ కనిపించదు.ఈ కామెంట్‌తో నేను కొంత వివాదానికి కారణం కావచ్చు అని మాధవన్‌ అన్నారు. ఈ సందర్భంగా హీరో మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.