Hyper Aadi: అందులో వేలుపెట్టు కానీ కంటెంట్ లో వేలు పెట్టకు అంటూ సుజాత పరువు తీసిన హైపర్ ఆది!

Hyper Aadi: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలను ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇంకా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మరికొంత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతుంది ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది తన కామెడీ పంచ్ ద్వారా సుజాతను దారుణంగా అవమానించారు.

ఈ ప్రోమోలో భాగంగా సుజాత హైపర్ ఆదితో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే సుజాత మాట్లాడుతూ ఆదిగారు చెప్పండి. ఈ కార్యక్రమంలో పాటలు పాడాలా..లేక డాన్సులు చేయనా అంటూ అడిగారు. దీంతో హైపర్ ఆది మాట్లాడుతూ నువ్వు రాకేష్ ఇచ్చిన రింగులో వేలు పెట్టు కానీ నా కంటెంట్ లో వేలు పెట్టకు అంటూ దారుణంగా తన పరువు తీశారు. దీంతో ఒక్కసారిగా ఈ కార్యక్రమంలో నవ్వులు విరబూస్తాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.

సుజాత రాకింగ్ రాకేష్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరికీ తెలిసిందే. కావాలంటే సందర్భంగా రాకింగ్ రాకేష్ జబర్దస్త్ వేదికపైనే మోకాలిపై కూర్చుని సుజాత వేలికి రింగు తొడిగిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరి ప్రేమ గురించి బహిరంగంగా తెలియజేయడంతో అప్పటినుంచి ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక వీరు కూడా నిజజీవితంలో ఒక్కటైతే ఎంతో బాగుంటుందనీ లక్షలాది మంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే వీరి కోరిక తీరబోతుందని తెలుస్తోంది.