Pushpa Effect : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ అయ్యి సాలిడ్ విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా హిట్ అయితే ఒక్క మన దగ్గర కాకుండా హిందీలో కూడా పెద్ద స్థాయిలోనే అయ్యింది.
దీనితో ఈ సినిమాకి ఈ రేంజ్ రెస్పాన్స్ బన్నీ అందుకోవడంతో ఇదే క్రేజ్ లో తన మరో భారీ హిట్ సినిమా “అల వైకుంఠపురములో” ని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి అక్కడ డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసిన నిర్మాతలు ఫిక్స్ చేశారు. అయితే ఏఈ సినిమాపై ఇప్పుడు ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తుంది.
ఈ సినిమాని పుష్ప క్రేజ్ ని ఉపయోగించి ఏకంగా 2 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారట. ఇది అయ్యిన పుష్ప లెక్క కన్నా ఎక్కువ. అంటే ఈ లెక్కన పుష్ప ఎఫెక్ట్ బాలీవుడ్ జనంలో ఏ స్థాయిలో ఉందొ అనిపిస్తుంది. అయితే ఇది పుష్ప ఎఫెక్ట్ అనేకన్నా అల్లు అర్జున్ ఎఫెక్ట్ అని చెప్పాలి.
తన సినిమాలను భారీ స్థాయిలో హిందీ జనం చూస్తారు దానిని పుష్ప ప్రూవ్ చేసింది. అందుకే దీనితో బన్నీ క్రేజ్ ను దృష్టిలో పెట్టి అల వైకుంఠపురములో కి 2000 స్క్రీన్స్ దక్కాయి. ఇక ఈ సినిమా ఎలా ఆడుతుంది అనేది మిగతా ప్రశ్న. మరి ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.