Pushpa Deleted Scene: సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తేనే వాళ్లు.. సినిమాను విడుదల చేయడానికి అనుమతి లభించినట్లు. అంతేకాదు అందులో ఏమైనా అసభ్యకరమైన సీన్స్ ఏమైనా ఉంటే.. వాటిని డిలీట్ చేయించే బాధ్యత కూడా వాళ్లే తీసుకుంటారు. ఇలా సినిమా మొత్తం షూటింగ్ లో తీసిన వీడియోలు అన్నీ సినిమాలో కనిపిస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. ఇలానే కటింగ్ లో వెళ్లిపోతాయి. వాటినే మనం సినిమా భాషలో చెప్పాలంటే.. ఎడిటింగ్ అంటాం.
తాజాగా థియేటర్లలో విడుదల అయి సెన్సెషనల్ హిట్ కొట్టిన సినిమా పుష్ప. ఇది దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగులోనే కాకుండా హిందీ సహా ఇతర భాషల్లోనూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సినిమా.
అల్లు అర్జున్, సుక్కు కాంబోలో వచ్చిన ఈ సినిమా మూడోది. అయితే ఈ సినిమాలో కూడా డిలీట్ చేసిన సీన్లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. మూత్రీ మూవీ మేకర్స్ ఆ సీన్ ను విడుదల చేశారు. ఇందులో ఏముందంటే.. అల్లు అర్జున్ తన ఇంట్లో పడుకొని ఉంటాడు.
అక్కడకు వాళ్ల అమ్మకు అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తీర్చమని అడుగుతాడు. కొన్ని రోజులు ఆగాలని అడగ్గా.. అతడు తన నోటికి వచ్చినట్లు అందరి ముందు తిడుతాడు. మరుసటి రోజు అప్పు ఇచ్చిన వ్యక్తికి బర్రెలు అమ్మి అప్పు తీర్చేస్తాడు పుష్పరాజ్. అందరి ముందు మా అమ్మాని ఎలా తిట్టావో.. ఇప్పుడు అదే అందరి ముందు తాను డబ్బులు ఇచ్చినట్లు చెప్పాలి అంటూ.. కొట్టుకుంటూ ఊరు మొత్తం తిప్పుతాడు. సినిమా లెంన్త్ కావడంతో ఈ సీన్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సీన్ వైరల్ గా మారింది. ఈ సీన్ సినిమాల్లో ఉంటే బాగుండదంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

