Pushpa : ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి వండర్స్ ను అందుకొంటుందో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం హద్దులు చెరిపేసి చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి లతో చేసిన భారీ సినిమా “బాహుబలి” సిరీస్ సినిమాలతోనే అని చెప్పాలి.
ఇక్కడ నుంచి తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. అతి ముఖ్యంగా హిందీలో డామినేషన్ వేరే లెవెల్లో కనిపిస్తుంది. హిందీలో బాహుబలి 2 నమోదు చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న లెక్క పక్కన పెడితే ఓ సినిమా అక్కడ ఎంత స్ట్రాంగ్ గా నిలబడింది అనేది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ హిట్ సినిమా “పుష్ప పార్ట్ 1” ప్రూవ్ చేసింది.
చెప్తే నమ్మరు కానీ ఈ సినిమాలో రిలీజ్ అయ్యి 10 వారాలు అయ్యినా అక్కడ థియేటర్స్ లో ఆడుతుంది అట. అలా ఆడటమే కాకుండా పదో వారంలో బాహుబలి 2 లాంటి సినిమాని మించి అందుకుంది అట. బాహుబలి 2 సినిమాకి హిందీ బెల్ట్ లో పదో వారం రన్ కి 70 నుంచి 75 లక్షల మధ్య వసూళ్లు రాగా పుష్ప కి మాత్రం ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయట.
ఇప్పుడు ఇదే మళ్ళీ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలని ఆశ్చర్య పరుస్తున్న విషయం. మరి ఇప్పటికీ కూడా పుష్ప రన్ అవుతూ అందులోని ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబలిని మించి వసూళ్లు చెయ్యడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదని చెప్పి తీరాల్సిందే. మరి సుకుమార్ క్రియేట్ చేసిన ఈ సినిమా రెండో పార్ట్ ఎలాంటి వండర్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.