బాలీవుడ్లో ఏమవుతుంది? ఆ కేసుల్లో ‘పుష్ప’, ‘సాహో’ హాట్ బ్యూటీలు..

ఇటీవల బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఓ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది పైగా ఆర్యన్ పై ఎక్కడా కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చే దాఖలాలు కూడా కనపడకపోగా ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి హీట్ స్టార్ట్ అయ్యింది. కాకపోతే ఈసారి అక్కడికి చెందిన ఇద్దరు హాట్ ముద్దుగుమ్మలు ఈడీ డిపార్ట్మెంట్ నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

దాదాపు 200 కోట్ల మేర మనీ లాండరింగ్ కేసులో నోరా ఫతేహి, ఇంకా జాక్వలిన్ ఫెర్నాండేజ్ లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ నోరా ఫతేహి ని 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చెయ్యగా జాక్వలిన్ ను ఈరోజు వారు ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ కేసులో మరింతమంది బడా పేర్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ భారీ చిత్రం “సాహో” లో హాట్ ట్=ఐటెం సాంగ్ చేసి హీట్ ఎక్కించగా ఇప్పుడు పుష్ప లో మంచి ఐటెం సాంగ్ కి గాను నోరా ఫిక్స్ అయ్యింది అని రీసెంట్ గానే తెలిసింది. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ వారికి చోటు చేసుకుంది ఫైనల్ గా ఏ కేసు ఏమవుతుందో చూడాలి.