Pushpa 2: పుష్ప సినిమా నుంచి కపుల్స్ సాంగ్ వీడియో వర్షన్ విడుదల.. నెట్టింట వీడియో వైరల్!

Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప 2. రష్మిక మందన ఇందులో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల డిసెంబర్ 5న భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కోట్లల్లో కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించిన విషయం తెలిసిందే. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా ఒకవైపు కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుండగా మరోవైపు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను విడుదల చేస్తూనే ఉన్నారు మూవీ మేకర్స్.

అందులో భాగంగానే ఈ సినిమా నుంచి ఒక్కొక్క వీడియో ఫుల్ సాంగ్స్ ని విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరొక వీడియో సాంగ్ ని విడుదల చేశారు. పుష్ప లో కపుల్స్ సాంగ్ అయిన” చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి” అనే పాట విడుదల అయింది. శ్రేయా ఘోషల్‌ ఆలపించిన ఈ సాంగ్‌ ఆడియో వర్షన్‌ అన్ని భాషలలో ఇప్పటి వరకు 500 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. అయితే తాజాగా విడుదలైన ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇంకెన్ని అంచనాలను రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Full Video: SOOSEKI | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | Shreya Ghoshal | Sukumar| DSP

కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప సినిమా. ఇప్పుడు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. తెలుగులో ఈ సినిమా జోరు కాస్త తగ్గినప్పటికీ మిగతా భాషల్లో మాత్రం ఈ సినిమా జోరు అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ వరుస వివాదాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే..