Ram – Lakshman: అంతకుముందు సినిమాలు చేసి ఉన్నా కూడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వల్ల తమకు వెండి తెరకు మరింత చేరువయ్యారని ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ తెలిపారు. కానీ వారికీ, ఆయనకు పోకిరీ సినిమా తర్వాత బ్రేక్ వచ్చిందని వారు చెప్పుకొచ్చారు. హీరోని బట్టి ట్రెండింగ్ మారుతూ ఉంటుందన్న రామ్, లక్ష్మణ్.. మహేశ్ బాబుకు అప్పట్లో విజయన్ అనే ఫైట్ మాస్టర్ ఉండేవారని వారు తెలిపారు. అలా ఒక్కో హీరోకు ఒక్కో ఫైట్ మాస్టర్స్ ఉంటారని వారు అన్నారు. కానీ అప్పటికి తాము అంత పెద్ద హీరోలకు చేసే స్థాయికి ఇంకా రాలేదని రామ్, లక్ష్మణ్ చెప్పారు.
ఇక అప్పట్లో తమ రేంజ్‌కి తగ్గట్టు తామకు కొన్ని సినిమాలు చేశామని వారు తెలిపారు. పూరీగారు పెద్ద హీరోలతో చేయడం వల్ల ఒక్కొక్కరికి వేరే ఫైట్ మాస్టర్స్ ఉండేవారని వారు అన్నారు. ఇక విషయానికొస్తే పూరీ గారికీ, తమకూ మధ్య ఎలాంటి విబేధాలూ రాలేదన్న వారు, అప్పుడు ఆయన తీసే హీరోని బట్టి సందర్భం కూడా మారిపోయిందని వారు చెప్పారు. అలా కొందరు హీరోల వల్ల తమకు దూరమవుతూ వచ్చాడని వారు తెలిపారు. అంతే గానీ తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని వారు స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆయన చాలా మంచి మనిషని కూడా వారు చెప్పారు.
ఒక టెక్నిషియన్‌ను నమ్మి, తమను శారదా స్టూడియోస్‌లో ఇడియట్ సినిమా ఓపెన్ చేసి, ఫైట్ చేయండని కెమెరా ఇచ్చేసి వెళ్లిపోయారని వారు అన్నారు. తమ మీద ఆయన పెట్టుకున్న నమ్మకం అలాంటిదని వారు చెప్పారు. మామూలుగా అయితే నిరూపించుకున్నాక ఎవరైనా నమ్ముతారని, కానీ తామెవరో తెలియకుండా, ఎలా చేస్తామో తెలియకుండా తమను నమ్మి అలా అప్పగించడం అనేది చాలా గొప్ప విషయం అని వారు తెలిపారు. ఆయన్ని తమ జీవితాంతం మర్చిపోలేమని వారు ఈ సందర్భంగా చెప్పారు. కాబట్టి ఫైట్ మాస్టర్స్‌గా ఫస్ట్ బీజం వేసింది మాత్రం పూరీ జగన్నాథే అని వారు స్పష్టం చేశారు.