పూరి, ఛార్మి లను అమ్మ, నాన్న అన్న స్టార్ హీరో

తెలుగు లో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ఈ మధ్య తన సినిమాలు అంతగా ఆడకపోయినా….ఇప్పుడొస్తున్న పాన్ ఇండియా ‘లైగర్’ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. హిందీ లో బిజినెస్ బాగానే అవుతున్నా…తెలుగు లో మాత్రం ఇంకా బిజినెస్ అవ్వలేదు.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగం గా విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. `నన్ను అప్పుడే సూపర్‌ స్టార్‌ అని పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పేరుకి తగినంత నేనింకా చేయలేదు. ఇంకా చాలా చేయాలి` అని అన్నారు విజయ్‌ దేవరకొండ.

ఆదివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో మాట్లాడిన విజయ్ `లైగర్‌`లో ఓ సరూర్‌ నగర్‌ పొరగాడు, వాళ్లమ్మ కలిసి ముంబయి వెళ్తారు ఇండియా షేక్‌ చేద్దామని. కొడుకుని ఛాంపియన్‌ని చేయాలని అమ్మ అనుకుంటుంది. మేం కూడా అంతే, మా లైఫ్‌ కూడా అంతే. కానీ నన్ను రోజూ సూపర్‌ స్టార్‌ సూపర్‌స్టార్‌ అని పిలుస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఆ పేరుకి నేనింకా తగినంత చేయలేదు. ఇంకా చాలా చేయాలి. కాకపోతే నేనూ కూడా బయలు దేరా చాలా చేయాలని. పూరీ మా నాన్నలాగా, ఛార్మి మా అమ్మలాగా, ముగ్గురం కలిసి ముంబాయికి వెళ్ళినం, ఇండియా షేక్‌ చేయాలని. ఇంక ఏం ఇబ్బంది వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా, ఎవరి మాట వినేదే లేదు. కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయినం` అని చెప్పారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వస్తున్నా ఈ సినిమాలో అనన్య పండేయ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 25 న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.