AP: 150 కాస్తా 11 అయ్యాయి….. వైసీపీని టార్గెట్ చేసిన పృథ్వీరాజ్…. సినిమాను బాయ్ కాట్ చేయాలంటున్న ఫ్యాన్స్?

AP: హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ పృథ్వీరాజ్ వైసిపిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఎంతోమంది వైసిపి అభిమానులు ఈయన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీలో ఈ సినిమాని తప్పనిసరిగా బాయ్ కాట్ చేస్తామంటూ ఫైర్ అవుతున్నారు. ఇలా సినిమా వేడుకకు వచ్చిన ప్రతిసారి సినిమా ఇండస్ట్రీకి చెందినవారు వైసీపీని టార్గెట్ చేస్తూ ఉండటం ఆనవాయితీగా మారిపోయింది తాజాగా పృథ్విరాజ్ సైతం ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి మాట్లాడుతూ వైసీపీకి వచ్చిన సీట్ల గురించి విమర్శలు కురిపించారు.

మేకల సత్యం అనే పాత్ర షూట్ జరిగేటప్పుడు ఒక సంఘటన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 150 మేకలు ఉన్నాయని పృథ్వి చెప్పారు. చివరికి ఆ మేకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే కేవలం 11 మాత్రమే ఉన్నాయి అంటూ ఈయన మాట్లాడారు ఈయన పరోక్షంగా వైకాపా ఎమ్మెల్యేలను గొర్రెలతో పోలుస్తూ గత ఎన్నికలలో 11 మాత్రమే వచ్చాయని విమర్శించారు. దీంతో ఇక్కడే వైసిపి పార్టీ నేతలకు మండింది. సినిమా గురించి మాట్లాడకుండా… వైసిపి పార్టీకి వచ్చిన 11 సీట్ల గురించి పృధ్విరాజ్ మాట్లాడటంతో వైకాపా అభిమానులు ఈ సినిమాని బాయికాట్ లైలా మూవీ అనే హ్యాస్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేస్తున్నారు.