Dragon: డ్రాగన్ హై వోల్టేజ్ మూవీ… ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తుంది… అంచనాలు పెంచేసిన నిర్మాత!

Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ తన తదుపరిచిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేశారు సాధారణంగా రాజమౌళి సినిమా తర్వాత తదుపరి సినిమాలలో హీరోలు నటిస్తూ తప్పనిసరిగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

అయితే ఈ సెంటిమెంటును బద్దల కొడుతూ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనులు కూడా జరుగుతున్నాయి మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమా పనులలో కూడా తారక్ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ పనులలో బాగమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు డ్రాగన్ అని టైటిల్ కూడా ఖరారు చేశారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటికే డ్రాగన్ పేరుతో రావడంతో ఇప్పుడు తమిళ్ లో పేరు మార్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. డ్రాగన్ పేరుతో వచ్చి హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ చాలా పెద్దది ఈ సినిమా హై ఓల్టేజ్ సినిమా. ఇంటర్ నేషనల్ లెవల్ లో ఈ విడుదలకానుంది. డ్రాగన్ మొత్తాన్ని చుట్టేస్తుంది అని రవిశంకర్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తుంది.