Valimai: వలిమై ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Valimai: దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ హీరో అజిత్ నటించిన పాన్ ఇండియా సినిమా వలిమై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 24 న విడుదల అయి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

ఇక వలిమై సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను అఫీషియల్ గా ప్రకటిస్తూ సినిమా పి ఆర్ ఓ రమేష్ బాల ట్వీట్ చేశాడు.వలిమై సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి సృష్టించిన తొలి సినిమాగా నిలిచిందని, తమిళనాడులో మొదటి రోజే 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని వెల్లడించారు. ఇక తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో కలిపి 50 నుంచి 60 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.