అయ్యో పింకీ.. మానస్, కాజల్ నీ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడుకున్నారా?

బిగ్ బాస్ షో చూస్తుండగానే 13 వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. ఇక 13వ వారం ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఎలిమినేష‌న్‌లో మ‌రోసారి సోషల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లే నిజ‌మయ్యాయి. 19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం స‌న్నీ, మాన‌స్‌, శ్రీరామ చంద్ర‌, ష‌ణ్ముక్‌, సిరి, కాజ‌ల్ మాత్ర‌మే మిగిలారు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక నాగార్జున‌తో ఒక్కొక్క‌రి గురించి త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేసింది. అయితే అందరి గురించి బిగ్ బాస్ స్టేజ్‌పై పాజిటివ్‌గా మాట్లాడిన ప్రియాంక‌ ఎలిమినేష‌న్ త‌ర్వాత అరియానాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాత్రం మ‌రింత నిక్క‌చ్చిగా త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేసింది. దీనికి సంబంధించిన ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది.అరియానా ఇచ్చిన చిన్న టాస్కును ఇవ్వగా అది పూర్తి చేసింది.బిగ్‌బాస్ హౌస్‌లో పింకీ అంటే మాకు మాన‌స్ గుర్తుకొస్తాడు అని అరియానా అడిగిన ప్ర‌శ్న‌కు మాన‌స్ గేమ్ నేను ఆడితే ఇక మా ఇద్ద‌రికీ ఒక‌టే ట్రోఫీ ఇచ్చేయండి అని స‌మాధానం చెప్పింది పింకీ.

హౌస్ లో ఇన్ని వారాలు హౌస్‌లో ఉన్నారు క‌దా, మీ అభిప్రాయం ప్ర‌కారం టైటిల్ ఎవ‌రు గెలుస్తారు?అని అరియనా ప్రశ్నించగా.. ఏమాత్రం త‌డుముకోకుండా మానస్ అంటూ బ‌దులిచ్చింది పింకీ. ఈ క్రమంలోనే అరియనా మాన‌స్ -కాజ‌ల్ క‌లిసి ప్రియాంక గురించి మాట్లాడుకున్న వీడియోను చూపించింది. ఆ వీడియో చూసిన పింకీ షాకైంది. మాన‌స్ చాలా సారి..ఇది నీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు అని చెప్పింది ప్రియాంక‌. అలాగే మాన‌స్‌కు ఏమైనా చెప్పాల‌నుకుంటున్నారా? అని అడిగగా మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఎవ‌రినైనా చ‌దివి ఈజీగా ప‌క్క‌న పెడ‌తాడు అని. నాకు పిల్ల‌లుంటే ఎలా చూసుకునే దాన్నో అలాగే చూసుకున్నానంటూ ప్రియాంక చెబుతూ క‌న్నీళ్లు ఎమోషనల్ అయ్యింది.