బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ సుదీప గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సుదీప నువ్వు నాకు నచ్చావు సినిమాలో పింకీ పాత్ర ద్వారా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలలో, సీరియల్ లలో నటించింది. బాల్య నటిగా ఉన్నప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.1987లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు శాస్త్రీయ నృత్యకారులు. సుదీప మూడు సంవత్సరాల వయసునుండే స్టేజిపై పర్ఫామెన్స్ ఇవ్వడం ప్రారంభించింది.

కొంతకాలం చదువు కోసం సినిమాలకు దూరంగా ఉండి ఎంబీఏ పూర్తి చేసింది. సుదీప, కే శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివాహం చేసుకుంది. 1994లో రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఎం ధర్మరాజు సినిమాతో బాల్యనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత అల్లుడుగారు, మా అన్నయ్య, నువ్వు నాకు నచ్చావ్, హనుమాన్ జంక్షన్, 7/జి బృందావన కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ ద్వారా బాగా పాపులర్ అయింది. చాలామంది ఈమెను పింకీ అని పిలుస్తారు. బాల్య నటిగా, కొన్ని సహాయ పాత్రలలో రాణించింది. ఈమె ఎక్కువగా హీరో లేదా హీరోయిన్ కి చెల్లెలిగా నటించింది. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే సునయన, కొత్త బంగారం, మావిచిగురు, పసుపు కుంకుమ, ప్రతిఘటన, ఆ ఒక్కటి అడక్కు లాంటి సీరియల్ లలో నటించడం జరిగింది.

అయితే వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలు నిర్వహణ కోసం సినిమాలకు, సీరియలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సినిమాలలో, సీరియల్లలో మంచి పాత్ర వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపింది. అయితే తను నటించాలి అని అనుకుంది కానీ హీరోయిన్ కావాలని ఎన్నడూ అనుకోలేదట.ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది.