దీపావళి సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయ ప్రముఖులంతా ముఖ్యంగా గ్లామర్ ప్రపంచానికి చెందిన నటి నటులు వారి వారి దీపావళి సంబరాలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.
కరోనా విపత్తు ఉన్న ఈ సందర్భంలో కూడా సోషల్ మీడియాలో మాత్రం పండగ శోభ ఏ మాత్రం తగ్గలేదు. సామాన్య ప్రజానీకం దీపావళి ఎలా చేసుకున్నారు అనేది పక్కన పెడితే ప్రముఖులు మాత్రం బాగానే సందడి చేసినట్టు ఉంది.
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రస్తుత హాలీవుడ్ లో ఎక్కువగా పని చేస్తున్న ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి దీపావళి ఘనంగా జరుపుకున్నారు. దానికి గుర్తుగా ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో అభిమానులతో పంచుకుంది. ప్రియాంక చోప్రా తన భర్త దియాలు పట్టుకుని తన్మయత్వంగా ఒకరినొకరు చూసుకునే విధానం చూస్తే ప్రియాంక అభిమానులకు మతిపోవాల్సిందే.
2016 నుండి ఇద్దరు రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకొని దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నా ప్రియాంక మరియు నిక్ జోనస్ వారి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలను చూస్తే ఇప్పటికీ కొత్త ప్రేమ జంట ఉన్నట్టు వుంటారు.
ఏది ఏమైనప్పటికీ ఒక విదేశీయుడు ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక మన భారత సంస్కృతి మర్చిపోకుండా పైపెచ్చు ఆ సంస్కృతిని విదేశాల్లో ప్రమోట్ చేయడం మనందరం ఆనందించదగ్గ పరిణామమే.