KCR: గులాబీ బాస్ కేసీఆర్ కు లేఖ రాసిన ప్రధాని నరేంద్ర మోడీ…. ఎందుకంటే?

KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇలా ఊహించిన విధంగా ప్రధానమంత్రి నుంచి కెసిఆర్ కు లేఖ రావడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ప్రధాని లేఖ రాయడం వెనుక కారణం లేకపోలేదు ఇటీవల కెసిఆర్ సోదరి సకలమ్మ మరణించిన విషయం తెలిసిందే.

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈమె ఇటీవల చికిత్స పొందుతూ మరణించారు ఇలా కేసీఆర్ సోదరి మరణించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కేసిఆర్ కు ప్రత్యేకంగా ఒక లేఖ రాస్తూ సంతాపం ప్రకటించారు. కెసిఆర్ సోదరి మరణానికి తాము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.ఆమె కుటుంబానికి, మీకు సానుభూతి తెలుపుతున్నానని ప్రధాని మోడీ కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని మోడీ లేఖలో ఆకాంక్షించారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కెసిఆర్ సోదరి సకలమ్మ గత నెల 23వ తేదీ హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25 న మరణించిన విషయం తెలిసిందే. ఇలా కెసిఆర్ సోదరీ మరణించడంతోనే ప్రధాని లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇక ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు అయితే ఈయన ఇటీవల తన పార్టీ కార్యకర్తలతో పలువురు కీలక నేతలతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈయన కాంగ్రెస్ పాలన పై మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. ఇక కెసిఆర్ వ్యవహారం చూస్తుంటే తిరిగి ప్రజలలోకి రాబోతున్నారని స్పష్టమవతుంది.