ప్రధాన మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలి: రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. బాధితులను పరామర్శించడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ విధంగా అక్కడి మీడియా సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడారు.

దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న ఆర్మీ ఉద్యోగార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని.. ప్రధాన మోదీ తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని అన్నారు. అంతే కాకుండా 2020 ఎంపికైన విద్యార్థులకు రాతపరీక్షలు నిర్వహించాలంటూ, గాయపడ్డ విద్యార్థులకు యూనిఫాం శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. కేంద్రం వల్లే విద్యార్థులు గాయపడ్డారని.. ఘటనకు సంబంధించిన కేసు గురించి ఉపసంహరించుకోవాలని.. ఈ విషయంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని అన్నారు.