చెత్త ఏరిన ప్రధాని.. వీడియో వైరల్!

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటారు. అంతేకాకుండా తానే స్వయంగా పలు పనులు కూడా చేపడతూ అందరి దృష్టిలో పడతారు. అలా తాజాగా చెత్త ఏరుతూ అందరి దృష్టిలో పడ్డారు. దేశంలోని అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

దాంతో తాజాగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ లో కొత్తగా ప్రారంభించిన భూగర్భ సొరంగంలో చెత్తను ఏరుతో కనిపించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి నెటిజన్లు, తమ పార్టీ కార్యకర్తలు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.