సలార్ విషయంలో ప్రభాస్ కి అలాంటి కండీషన్ పెట్టిన ప్రశాంత్ నీల్!

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత ఈయన నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి.అయితే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోయిందని మునుపటిలా ఈయన ఫిట్ గా లేరని తెలుస్తోంది. అభిమానుల నుంచి కూడా ఇదే వాదనలు వినిపించాయి. ఇకపోతే ప్రభాస్ లుక్, బాడీ ఫిట్ నెస్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం అధిక శరీర బరువు ఉన్న ప్రభాస్ ను సలార్ సినిమా కోసం తప్పకుండా శరీర బరువు తగ్గాలని కండీషన్ పెట్టారట. ఈ క్రమంలోనే ప్రభాస్ భారీగా వర్కౌట్స్ చేస్తూ శరీర బరువు తగ్గడం కోసం కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఇక బాహుబలి తర్వాత వరుసగా రెండు ఫ్లాప్ చిత్రాలు రావడంతో ప్రభాస్ సలార్ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అభిమానుల అంచనాలకు చేరుకోనేలా ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని త్వరలోనే మరో షెడ్యుల్ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకొని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హాంబలే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.