ప్రభాస్ సినిమాలో ఆమె కోసం కోట్లు కుమ్మరిస్తారట

Prashant Neel to cast star heroine for Salaar

Prashant Neel to cast star heroine for Salaar

ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ‘కెజిఎఫ్’ తరవాత ఆయన లెవల్ పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. వాళ్లలో ప్రశాంత్ నీల్ చూపు ప్రభాస్ మీద పడింది. దాంతో ‘సలార్’ చిత్రం మొదలైంది. భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. డైరెక్టర్ అడిగిందల్లా క్షణాల్లో సెట్ చేసేస్తున్నారట నిర్మాతలు. ఇది లేదు అది దొరకదు అని చెప్పకుండా ఏది కావాలంటే అది తీసుకొస్తున్నారట.

ఇప్పటికే సినిమాలో నటించడానికి స్టార్ నటీనటుల్ని దింపగా ఇప్పుడు ఇంకొక హీరోయిన్ ను తీసుకురావాలని చూస్తున్నారట. అయితే ఈ హీరోయిన్ కథ కోసం కాదు ఒక స్పెషల్ సాంగ్ కోసం. ప్రశాంత్ నీల్ చిత్రంలో ఒక మాంచి స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసుకున్నారట. అందులో నటించడం కోసం స్టార్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. ఆయ్నజాబితాలో కొందరు పేర్లు ఉన్నాయట. వాటిని నిర్మాతల ముందు పెట్టి వీళ్ళలో ఎవరో ఒకర్ని తీసుకురమ్మని చెప్పారట. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ అడిగితే కాదనేదేముంది. ఎంత అడిగినా సరే తీసుకొచ్చేయాలని చెక్ బుక్ పట్టుకుని రంగంలోకి దిగేశారు నిర్మాతలు.