ఏం పిల్లో ఏం పిల్లడో ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రణీత సుభాష్ అత్తారింటికి దారేది సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో సమంతకి సోదరిగా ప్రధాన పాత్రలో నటించి అందరిని మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. కరోనా సమయంలో రహస్యంగా వివాహం చేసుకున్న ఈ అమ్మడు తన భర్త పుట్టినరోజున సందర్భంగా ఏప్రిల్ 11న తన ప్రెగ్నెన్సీ విషయం బయట పెట్టింది. పెళ్ళి తరవాత ఇండస్ట్రీకి దూరమైన ప్రణీత సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసిన ఈ అమ్మడు.. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం , జాగ్రత్తలు, వ్యాయామాలు చేస్తూ తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ లో ఉన్న అనుభూతులను ఆస్వాదిస్తోంది. ఇటీవల బంధుమిత్రుల మద్య సీమంతం కూడా జరుపుకుంది. తన సీమంతనికి సంబందించిన ఫోటోలు కూడా సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ప్రణీత ప్రెగ్నెన్సీ చివరి దశని ఆస్వాదిస్తోంది. ఇటీవల తన బెబీ బంప్ ఫోటోలను సోషియల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ వేసుకొని తల మీద హ్యాట్ పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రణీత ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ హార్ట్ ఫెల్ట్ నోట్ రాసుకొచ్చింది. ఈ నోట్ లో ” ప్రస్తుతం ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉంది.
ప్రెగ్నెన్సీలో పెరిగిన ప్రతి పౌండ్ బరువు, చర్మం సాగిన గుర్తులు, గుమ్మడికాయ లాంటి నా ముఖం, పెద్దదైన ముక్కు, గుండె బరువెక్కిపోవడం, వంటివి అన్నీ నాకు చాలా విలువైనవి ” అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.