షాకింగ్ : తగ్గని ‘మా’ హీట్..ప్రకాష్ రాజ్ హాట్ స్టేట్మెంట్ వైరల్

Prakash Raj Shocking And Viral Statements On Maa Election Again | Telugu Rajyam

గత కొన్ని రోజులు కితమే టాలీవుడ్ వద్ద జరిగినటువంటి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పటికీ రచ్చ లేపుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ప్యానల్ నడుమ జరిగినటువంటి ఈ రసవత్తర ఎన్నికల్లో ఊహించని విధంగా విష్ణు విజయం సాధించాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఈ గెలుపు సక్రమంగా జరగలేదని తన ప్యానల్ తో కలిసి ఇప్పటికీ పోరాటం చేస్తున్నాడు.

దీనితో కొన్ని ఊహించని కోణాలు ట్విస్టులే ఈ ఎన్నికలపై బయటకు రాగా ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా చేసిన మరో హాట్ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది. విష్ణు గెలుపులో భాగంగా ఏపీ కి చెందిన కొందరు రౌడీ షీట్ లు మా ఓటర్లను బెదిరించారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చెయ్యడం షాకింగ్ గా మారింది. దీనితో ఇప్పుడు ఈ అంశం వైరల్ అవుతోంది. మొత్తానికి మాత్రం ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా అయితే కనిపించడం లేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles