లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటించిన నయనతార లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. నయనతార ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది. హీరో శింబుతో నయనతార ప్రేమలో ఉందని కొన్ని రోజులు వార్తలు వినిపించాయి. తర్వత కొంత కాలానికి ప్రముఖ డాన్సు కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. నయనతార మొజులో పడి ప్రభుదేవా తన 15 ఏళ్ళ వైవాహిక బంధాన్ని కూడా వదులుకున్నాడు. ప్రేమించుకుని పెళ్లి పీటల వరకు వెళ్ళిన వీరి ప్రేమ అ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సమయంలో ప్రభుదేవ భార్య రామ్లాత్.. నయనతార మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.
అప్పటినుండి తరచూ నయనతార గురించి వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తూ వస్తున్న ప్రభుదేవా భార్య తాజాగా నయనతార పెళ్లి సందర్భంగా మరొక సారి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. ప్రభుదేవా నుండి విడిపోయిన తర్వాత కొంతకాలానికి నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ 2 రోజుల క్రితం సినీ ప్రముఖులు, బంధుమిత్రులు ఆధ్వర్యంలో మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో ఘనంగా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.
ఈ క్రమంలో ప్రభుదేవా భార్య రామ్లాత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నయనతార నా భర్త ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నట్లు నటించి సంసారంలో నిప్పులు పోసింది. 15 సంవత్సరాలు నన్ను ఒక దేవతల చూసుకున్న నా భర్త ఆమె మోజులో పడి నాకు విడాకులు ఇచ్చాడు. నా బ్రతుకు ఇలా రోడ్డున పడ్డానికి కారణం నయనతార. నాకు ఇంత అన్యాయం చేసిన తనని ఏ దేవుడు కూడా క్షమించడు. నయనతార నాకు కనిపిస్తే మాత్రం కచ్చితంగా నేను తనని కొడతాను అంటూ రామ్లాత్.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్స్ కూడా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.