ప్రభాస్ జీవితం నాశనం చేస్తుంది వాడే అంటున్న ప్రభాస్ తల్లి

ప్రభాస్, ఆరడుగుల అందగాడు. కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన ప్రభాస్  తొందరగానే స్టార్ హీరో గా ఎదిగాడు. ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్స్ తర్వాత ‘బాహుబలి’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ పెళ్లి అంటే మాత్రం నోరు మెదపడంలేదు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు చాలా సార్లు ప్రభాస్ పెళ్లి త్వరలో అవుతుంది అని చెప్పినా…ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మీడియా కి దూరంగా ఉండే ప్రభాస్ తల్లి ఈ విషయం పై స్పందించారు. తనకు కూడా అందరిలాగానే తన కొడుకు పెళ్లి చేసుకుని, పిల్లలతో ఉంటె చూడాలని ఉంది కానీ ప్రభాస్ కి పెళ్లి అంటే అంత ఇష్టంగా లేదని చెప్పారు.

ప్రభాస్ పెళ్లి అంటే భయపడడానికి కారణం ఒక వ్యక్తి అంట. అతనే ప్రభాస్ చిన్ననాటి ఫ్రెండ్ రవి. ఇప్పటికి క్లోజ్ గానే ఉంటారని. ప్రభాస్ ఎంత బిజీ గా ఉన్నా రవి తో మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతుంటాడని..అతనిది లవ్ ఫెయిల్యూర్ అని..ఇప్పటికే 45 ఏళ్లు దాటిపోయిన పెళ్ళి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడని అంటున్నారు ప్రభాస్ అమ్మగారు. అతనివల్లే ప్రభాస్ కి పెళ్లి అంటే భయం వేస్తుందని ఆమె బాధపడుతున్నారట. కనీసం వచ్చే కొన్ని రోజుల్లోనైనా ప్రభాస్ ఈ భయం పోగొట్టుకుని పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి.