Prabhas : వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న భారీ చిత్రాల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు మన తెలుగు నుంచే రెండు ఉన్నాయి. మరి వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి కాగా మరొకటి కేవలం ప్రభాస్ పేరుతోనే ఇండియన్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఇంకో పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్”.
సరిగ్గా వారం వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. మరి ఇదిలా ఉంటే ఓ పక్క ట్రిపుల్ ఆర్ బృందం భారీ ఖర్చులతో శరవేగంగా ప్రమోషన్స్ ని చేస్తూ ఉండగా ఇంకాఆ రాధే శ్యామ్ యూనిట్ మాత్రం కాస్త స్లో గానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర సమాచారం వినిపిస్తోంది.
సరిగ్గా “RRR” సినిమా రిలీజ్ రోజు అంటే ప్రభాస్ రంగంలోకి దిగనున్నాడట. అంటే వారం ఉంది అనగా తన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు అనేక ఇంటర్వ్యూ లు ఇచ్చేందుకు ప్రభాస్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడట. అక్కడ నుంచి తన వల్ల అయ్యినది అంతా పెట్టనున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. లాస్ట్ టైం సాహో కి కూడా ప్రభాస్ లాస్ట్ మినిట్ వరకు చాలా కష్టపడ్డాడు ఇక ఈ సినిమాకి ఏం చేస్తాడో చూడాలి.