Prabhas Vs Pooja Hegde : ప్రభాస్ వర్సెస్ పూజా హెగ్దే: ఆ వివాదం ఇంకా అలాగే వుందా.?

Prabhas Vs Pooja Hegde

Prabhas Vs Pooja Hegde :  సినిమా ప్రమోషన్లలో ప్రభాస్, పూజా హెగ్దే నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగే సమయంలో మాత్రం ఇబ్బందిగా వుంటున్నారట. ఇదీ ‘రాధేశ్యామ్‘ ప్రమోషన్ల విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. వెబ్ మీడియాలో అయితే, ఇంకా ఈ అంశంపై కథనాలు గట్టిగానే వస్తున్నాయి.

ప్రభాస్ అందరికీ డార్లింగ్.. అయితే, కాస్త మొహమాటస్తుడు. ఆ విషయం పూజా హెగ్దేకి కూడా తెలుసు. అదే విషయాన్ని ఆమె కూడా చెప్పింది. సినిమాలో తమ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ చెబుతోంది. ప్రభాస్ కూడా అంతే. ఈ సినిమాలో కొంచెం రొమాంటిక్ సీన్స్ బాగానే వుంటాయని చెప్పాడు. పూజా హెగ్దే మంచి కో-స్టార్ అని కూడా అన్నాడు.

ప్రభాస్, పూజా హెగ్దే.. ఎంతలా వివరణ ఇస్తున్నా వీరిద్దరి మధ్యా గొడవ.. అంటూ గాసిప్స్ మాత్రం ఎందుకు ఆగడంలేదు.? ఏమోగానీ, ఈ రకంగా ‘రాధేశ్యామ్’ సినిమాకి అదనపు పబ్లిసిటీ ఉచితంగా జరుగుతోందన్నది మాత్రం నిర్వివాదాంశం.

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో ‘రాధేశ్యామ్’ బృందం ఎడా పెడా ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది.