Prabhas: కొత్త సినిమా హీరోయిన్ కు తన ఇంటి భోజనం రుచి చూపించిన ప్రభాస్… ఫిదా అయిన నటి?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటి ఇమాన్వి నటించబోతున్న విషయం తెలిసిందే. ఇలా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారారు.

ఇక ప్రభాస్ అంటేనే అతిథి మర్యాదలకు మారుపేరు అని చెప్పాలి. ప్రభాస్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే అక్కడ వారందరికీ కూడా వారికి నచ్చిన ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి నుంచి తయారు చేయించి తీసుకువస్తూ ఉంటారు. ఇప్పటికే ఈయన పెట్టే ఆతిథ్యం గురించి ఎంతోమంది గొప్పగా చెప్పారు. తాజాగా నటి ఇమాన్వికీ సైతం ప్రభాస్ తన ఇంటి రుచులను చూపించారు. ఆమె కోసం వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ వంటలను స్వయంగా తన ఇంటిలో తయారు చేయించి పంపించారు దీంతో ఆమె ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ పంపిన వంటలకు సంబంధించిన ఒక చిన్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా ఈ వీడియోని షేర్ చేసిన ఈమె ఎమ్మి ఫుడ్ పంపించినందుకు ప్రభాస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. అయితే ప్రభాస్ ఇలా తన ఫుడ్ ద్వారా అందరి పట్ల అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రభాస్తో..హను రాఘవపూడి తెరకెక్కించనున్న ఫౌజీ సినిమా 1970ల నాటి వార్ పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. రజాకార్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నారని సమాచారం.