పాన్ ఇండియా హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తాజాగా ఈయన సీతారామం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని సందడి చేశారు.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో నటి మృణాల్ ఠాగూర్ నటిస్తోంది.ఈ సినిమా ఆగస్టు5 వ తేదీ విడుదల కావడంతో ఫ్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ తమకు థియేటర్ ఒక గుడి లాంటిదని అలాంటి పవిత్రమైన గుడిని ప్రేక్షకులు తమకు ఇచ్చారని తెలిపారు. అయితే మన ఇంట్లో దేవుడు గది ఉందనీ గుడికి వెళ్లడం మానేయం అలాగే ప్రేక్షకుల ప్రతి ఒకరు కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడాలని ప్రభాస్ అభిమానులను కోరారు. ఇకపోతే ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు అధికంగా పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని అందుకే పలువురు నిర్మాతలు వారి సినిమాలకు టికెట్లు పూర్తిగా తగ్గించి పాత టికెట్లను అమలులోకి తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే సీతారామం టికెట్లు కూడా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.సింగిల్ థియేటర్లో 100 రూపాయల టికెట్ ఉండగా మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయని ఈ కార్యక్రమంలో వెల్లడించారు. ఇకపోతే సీతారామం సినిమా ఫస్ట్ టికెట్ ను ప్రభాస్ కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమాకి టికెట్ కొనడానికి డబ్బులు తన దగ్గర లేకపోవడంతో నిర్మాత అశ్వినీ దత్ దగ్గర అప్పు చేసి మరి టికెట్ కొనుగోలు చేశారు. ఇలా ప్రభాస్ ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొనడం గమనార్హం.