ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ క్రేజ్ అండ్ స్టార్డం ఉన్నటువంటి స్టార్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే ఒకడు అని చెప్పాలి. బాహుబలి లాంటి భారీ హిట్స్ తర్వాత తనకి చాలా మంచి ఫేమ్ వచ్చింది కానీ ప్రభాస్ అయితే నెక్స్ట్ మాత్రం ఆ క్రేజ్ ని నిలబెట్టుకునే రేంజ్ హిట్ ని మళ్ళీ కొట్టలేదు.
అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమాకి డైరెక్ట్ గా బాలీవుడ్ కనెక్షన్ ఉంది. నిర్మాణంలో బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థే వచ్చినా కూడా వారి వల్లే ప్రభాస్ ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యినట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్తున్నా మాట.
లేటెస్ట్ గా బొల్ట్వుడ్ దర్శకుడు ఓంరౌత్ కూడా ప్రభాస్ రేంజ్ లో సినిమాని తీయలేకపోయాడు. దీనితో ఆదిపురుష్ సినిమా మళ్ళీ వాయిదా పడినట్టుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీనితో అయితే డెఫినెట్ గా బాలీవుడ్ వాళ్ళతో వర్క్ చేయడం అనే అంశంపై ప్రభాస్ కష్టమైనా కూడా హార్డ్ డెసిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పాలి.
వారు ప్రభాస్ సినిమాని సరిగా ప్రమోట్ చెయ్యలేకపోవడమే కాకుండా సదరు తన ఇమేజ్ ని పాడు చేస్తున్నారు. దీని విషయంలో మాత్రం ప్రభాస్ తన పేరుని వారి చేతిలో పెట్టి తనని తానే డీ గ్రేడ్ చేసుకుంటున్నాడని చెప్పాలి. డెఫినెట్ గా అయితే ప్రభాస్ మాత్రం ఈ విషయంలో మంచి డెసిషన్ అయితే తీసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.