The Raja Saab: ప్ర‌భాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల అయ్యేది అప్పుడే!

The Raja Saab: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా ప్రభాస్ చివరగా సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలపై ఇప్పటికే భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్ లు హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్. అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి ఈ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీనికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలాంటి తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. అలాగే టీజర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ ను జూన్ 16వ తేదీ ఉదయం 10:52 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరిలో డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. వరుసగా రెండు అప్డేట్లు ఒకేసారి విడుదల చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 16 కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.