Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో హీరోగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలలో నటించనున్నారు. అయితే రాజా సాబ్ సినిమాకు సంబంధించి పనులు పూర్తవ్వడంతో ప్రభాస్‌తో హను రాఘవపూడి చేస్తోన్న చిత్రాన్ని చకచకా పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఇప్పుడు మరోవైపు స్పిరిట్ సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. యానిమల్ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ఇది.
భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. త్రిప్తి దిమ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమాని సెప్టెంబరు నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీని కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. అయితే దీనికి తగ్గట్లుగానే పూర్వ నిర్మాణ పనుల్ని వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. హైఓల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను తొమ్మిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనున్నారు.