ఇన్సైడ్ టాక్ : దళపతి విజయ్ సినిమాలో ప్రభాస్ సాంగ్ రీమిక్స్ చేస్తున్నారా?

తమిళ స్టార్ హీరోలలో ఒకడైన దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు మరియు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అయితే ఇది తెలుగులో సహా విజయ్ కెరీర్ లో ఒక స్పెషల్ సినిమా కావడంతో మంచి ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయి. 

ఇక ప్లానింగ్స్ లోనే సంగీత దర్శకుడు థమన్ మంచి ఆల్బమ్ ని కూడా సెట్ చేస్తున్నాడు. ఇంకా ఇదిలా ఉండగా ఈ సినిమా ఆల్బమ్ పై అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత సినిమా అయినటువంటి “రాఘవేంద్ర” లో కలకత్తా పాన్ ఐటెం ఉందిగా దానిని విజయ్ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారట. 

అయితే మన తెలుగు ఆడియెన్స్ కి తెలియాలి అని ప్రభాస్ సినిమాతో పోల్చాము కానీ నిజానికి ఈ సాంగ్ తమిళ్ నుంచి తెలుగులో తీసుకొచ్చింది. తమిళ్ లో ఈ సాంగ్ విజయ్ దే కాగా ఆ సాంగ్ లో కూడా ప్రభాస్ తో చిందేసిన సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఐటం గర్ల్ గా కనిపించింది. 

ఇప్పుడు ఈ సాంగ్ నే వారసుడు లో రీమిక్స్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇదే గాని నిజం అయితే విజయ్ ఫ్యాన్స్ కి ఇంతకు మించి మంచి ట్రీట్ లేదని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం అందిస్తున్నాడు.