Rajasaab Teaser: రాజాసాబ్ మేకర్స్ కి షాక్.. మూడు రోజుల్లో టీజర్ విడుదల.. అంతలోనే అలా!

Rajasaab Teaser: టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టీజర్ ను ఈ నెల 16వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో టీజర్ విడుదల కాబోతుంది అన్న ఆనందంలో ఉన్న ప్రభాస్ అభిమానులకు, అలాగే మరో మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నాము అన్న ఆనందంలో ఉన్న మూవీ మేకర్స్ కు ఊహించని షాక్ ఎదురైంది. సరిగ్గా మూడు రోజుల ముందు అనుకొని సంఘటన జరిగింది. అదేమిటంటే ఎవరో టీజర్ ను లీక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే మూవీ టీం అలర్ట్ అయింది.

ఇలా చేసిన వారిని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేసింది. రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. అలానే అకౌంట్ సస్పెండ్ చేస్తాము. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాము అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. సంజయ్ దత్ విలన్‌గా చేశాడు. తమన్ సంగీటతాన్ని అందించారు.