Raja Saab: హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ రాజా సాబ్ క్లైమాక్స్ ఉండబోతోందా.. అంచనాలు పెంచేస్తున్న డీటెయిల్స్!

Raja Saab: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హర్రర్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ముఖ్యంగా ప్రభాస్ పంచె కట్టులో ఉన్న ఫోటో అంచనాలను ఒక రేంజ్ లో నిలబెట్టేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా యాక్షన్ పాత్రలే ఎక్కువగా చేసిన ప్రభాస్‌ ను ఇలా పూర్తి వినోదాత్మక పాత్రలో ఫ్యాన్స్ చూడబోతున్నారు. దాంతో ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలతో పాటుగా ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సుమారు 30 నిమిషాల పాటు ఉంటాయట. ఇందులో భారీ స్థాయిలో సీజీ వర్క్ ఉపయోగించబడిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలు విజువల్ వండర్ అనిపించేలా, సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. ముఖ్యంగా రాజా సాబ్ సినిమా క్లైమాక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇటీవలే పోస్టర్ రూపంలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.