భారీ మీటింగ్ పెట్టనున్న ప్రభాస్ ?

Prabhas planning for big fans meet
Prabhas planning for big fans meet
‘బాహుబలి’ తరవాత ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.  అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు తయారయ్యారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభాస్ క్రేజ్ రెట్టింపు అయింది.  ఆయన సినిమాల కోసం ఎదురుచూసే ఆడియన్స్ పెరిగిపోయారు.  ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ‘రాధేశ్యామ్’ తుది దశలో ఉంది. కొద్దిగా ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. జూలై మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టి కొన్ని రోజుల వ్యవధిలోనే కంప్లీట్ చేయాలనేది ప్రభాస్ టీమ్ ఆలోచన.  ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ళ నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 
 
అందుకే ప్రభాస్ షూటింగ్ చివరి రోజున షూటింగ్ లోకేషన్లో అభిమానులను కలవాలని అనుకుంటున్నారట.  గతంలో కూడ ‘బాహుబలి’ టైంలో ప్రభాస్ ఇలాగే అభిమానులను షూటింగ్ లోకేషన్లో కలవడం జరిగింది.  మళ్లీ అప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ మీట్ జరపలేదు.  అందుకే ఈసారి ‘రాధేశ్యామ్’ లొకేషన్లో మీట్ పెడతారని వినికిడి.  ప్రభాస్ గనుక నిజంగానే మీట్ పెడితే వేలాది మంది అభిమానులతో షూటింగ్ లోకేషన్ కిక్కిరిసిపోవడం ఖాయం. ఎలాగూ హైదరాబాద్లో కరోనా లాక్ డౌన్ నిబంధనలు కూడ లేవు కాబట్టి ఫ్యాన్స్ మీట్ జరుపుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు కూడ.