Prabhas Pan India Troubles : ‘బాహుబలి’ సినిమా కోసం ప్రబాస్ పడిన కష్టం అంతా ఇంతా కాదు, విపరీతంగా కండలు పెంచేశాడు. ఆ టైమ్‌లోనే ప్రబాస్ తీవ్రమైన భుజం నొప్పితో బాధపడ్డాడు. అయినా కానీ, షూటింగ్‌కి ఎలాంటి ఆటంకం లేకుండా వర్క్ చేశాడు.
ఆ తర్వాత ‘సాహో’.. ఆధ్యంతం యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో నడిచిన ఈ సినిమాకి ప్రబాస్ కాలు నొప్పితో బాధపడ్డాడు. కాలు నొప్పితో బాధపడుతూనే ఎలాగోలా ‘సాహో’ పూర్తి చేశాడు. అదే నొప్పి ‘రాధేశ్యామ్’ వరకూ ప్రబాస్‌ని వెంటాడింది.
‘రాధేశ్యామ్’లో అక్కడక్కడా ఆ నొప్పి చాలా ఇబ్బంది పెట్టిందని కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రబాస్ చెప్పలేదు కానీ, ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. అదీ ప్రబాస్ డెడికేషన్. ఆ డెడికేషనే ఆయన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిందేమో.
ఇక, ఇప్పుడు ఆ నొప్పి మరింత బాధించడంతో సర్జరీ చేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం ప్రబాస్ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయ్. అన్నీ బిగ్ ప్రాజెక్టులే. ‘ఆది పురుష్’, ‘సలార్’ సినిమాలు ఆల్రెడీ సెట్స్‌పై వున్నాయ్.
భారీ బడ్జెట్‌తో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్నసినిమాలివి. కానీ, భరించలేని కాలు నొప్పి కారణంగా సర్జరీ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమా షూటింగుల్లో పాల్గొననున్నాడట ప్రబాస్.
ఎంత నొప్పి వున్నా, ఆ నొప్పిని పళ్ల బిగువున దాచి పెట్టి, తనను నమ్ముకున్న నిర్మాతలకు ఎలాంటి నష్టం రాకూడదనే భావనతో ప్రబాస్ కష్టపడి పని చేశాడు. ఆ డెడికేషన్‌కే ప్రబాస్ అంటే దర్శక, నిర్మాతలకు ఎంతో అభిమానం.
అదే అభిమానం ఫ్యాన్స్‌లో కూడా. హ్యాట్సాఫ్ టు యువర్ డెడికేషన్ ప్రబాస్.