Prabhas : హాట్ న్యూస్ : ప్రపంచ దిగ్గజాలతో ప్రభాస్ పేరు..అరుదైన గౌరవం అందుకున్న డార్లింగ్.!

Prabhas : ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో మొట్ట మొదటి పేరుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు రాయడంలో సందేహమే లేదు అని చెప్పాలి. తన “బాహుబలి” సిరీస్ లతో ఇప్పుడు వరకు చేస్తున్న అన్ని సినిమాలతో ఓ రేంజ్ లో ప్రభాస్ నిలుచున్నాడు.

ఇలా ఎన్ని శిఖరాలు తాను అందుకున్నా కూడా ఎప్పటికీ మన డార్లింగ్ హీరోలా ఒదిగే ఉంటాడని అనేక మార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కానీ తన స్టార్డం మాత్రం ఇప్పుడు చెక్కు చెదరినిది బాక్సాఫీస్ స్టామినా మారనిది అని చెప్పి తీరాలి. అందుకే తాను కూడా ప్రపంచ దిగ్గజాలలో ఒకడిగా మన దేశం నుంచి నిలిచాడు.

మరి లేటెస్ట్ గా అయితే ప్రభాస్ మరో అరుదైన గౌరవాన్ని తాను అందుకున్నాడు. ప్రపంచంలో అత్యంత ఫేమస్ అయినటువంటి ట్విట్టర్ సంస్థ వారు ప్రపంచంలో ప్రభాస్ పేరుని కూడా ఆల్ టైం గ్రేట్ పర్సన్ గా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) లిస్ట్ అనేక మంది ప్రపంచ స్థాయి ప్రముఖ జాబితాలో ప్రభాస్ ని చేర్చి రివీల్ చేసారు.

అందుకు అనుగుణంగా ప్రభాస్ పేరును ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ తో కొత్తగా దాని పక్కన సింబాలిక్ గా గోట్(మేక) కూడా సింపుల్ గా కనిపిస్తుంది. అయితే ఈ లిస్ట్ లో ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ క్రీడాకారులు మెస్సి, రోనాల్డో రఫెల్ నడాల్ మన దేశం నుంచి విరాట్ కోహ్లీ ల పేర్లతో ప్రభాస్ పేరు కూడా టాప్ 5 లో నిలిచింది. ఇది నిజంగా ఒక గొప్ప ఎచీవ్మెంట్ అని చెప్పి తీరాల్సిందే.