ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయని అలాగే నటీనటులకు అత్యధిక పారితోషికం చెల్లించడం వల్ల నిర్మాతలకు సినిమాలు చేయడం కష్టతరంమం మారడంతో నిర్మాత మండలి సమావేశం అయ్యి కొన్ని రోజులపాటు సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకటవ తేదీ నుంచి టాలీవుడ్ సినిమాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలో నిలిచిపోవడం వల్ల ఎంతోమంది కార్మికుల నష్టపోతున్నారు.
ఈ విధంగా అర్థంతరంగా సినిమా షూటింగ్లో ఆగిపోవడంతో కొందరు నిర్మాతలకు నష్టాలు రావడమే కాకుండా హీరోలు కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ వాయిదా పడ్డాయి. ఈ ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టుకే, సలార్ వంటి సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ నిర్మాణం చేశారు. అయితే షూటింగ్ వాయిదా పడటం వల్ల ఈ రెండు షెడ్యూల్ కి కలిపి దాదాపు 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభాస్ కి కూడా ఈ కాల్ షీట్స్ మిస్ కావటం వల్ల ఏకంగా ఆయనకు ఐదు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సమ్మె కారణంగా ప్రభాస్ కి ఐదు కోట్ల రూపాయల నష్టం రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇప్పటికే సమ్మెలో కొంత మేర సడలింపు వచ్చాయి.మరి భారీ బడ్జెట్ సినిమాలు ఎప్పుడు తిరిగి షూటింగ్ ప్రారభమవుతాయో తెలియడంతో లేదు.