ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెట్టిన జ్యోతిష్యుడు

వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరేమో…గత కోనన్నాళ్లుగా తనని తాను చాలా గొప్ప జ్యోతిస్యుడిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. టీవీ లో డిబేట్ ల లో కూడా పాల్గొన్నాడు. వేణు స్వామి తరచూ సెలబ్రిటీ ల మీద కామెంట్స్ చేస్తూ ఫేమస్ అవుతూ ఉంటాడు. నాగ చైతన్య, సమంత ఇద్దరు విడిపోతారని తాను ముందే చెప్పానని, అలాగే రష్మిక కి తన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోమని తానె చెప్పానని అందుకే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

అయితే…ఇప్పుడు వేణు స్వామి చేసిన కొన్ని కామెంట్స్ ప్రభాస్ అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన పెళ్లి చేసుకోక పోవడం మంచిదని వేణు స్వామి అంటున్నాడు. ప్రభాస్పె కు ళ్లి కలిసి రాకపోవచ్చు, పెళ్లి చేసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అలాగే ఫెయిల్యూర్స్ ను ఎదుర్కోవలసి రావచ్చు అంటూ వేణు స్వామి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక వేల ప్రభాస్ పెళ్లి చేసుకుంటే భార్యతో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉందని వేణు స్వామి అన్నాడు.

అయితే ‘బాహుబలి’ సినిమా నుండి ప్రభాస్ పెళ్ళి వార్తలు వస్తూనే వున్నాయి. అనుష్క ని పెళ్లి చేసుకుంటాడని కొందరు, లేదు చుట్టాల అమ్మాయిని చేసుకుంటాడని కొందరు అన్నారు. కృష్ణం రాజు కూడా ‘సాహు’ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అయ్యే ఛాన్స్ ఉందని ఒకప్పుడు అన్నారు, కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.