Prabhas: సినీ నటుడు ప్రభాస్ చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇక ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యేలోపు ప్రభాస్ మరోసారి కన్నప్ప సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేశారు. కనప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
మంచు విష్ణు నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు 25 నుంచి 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ పాత్ర మాత్రం సినిమాకి హైలైట్ గా నిలిచిందని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ ని వెండితెరపై చూడటం కోసమే పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలి వెళ్తున్నారు. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్
సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటించడంతో ప్రమోషన్లకు వస్తారని అందరూ భావించారు.
ఇక ఈ సినిమాలో నటిస్తాను కానీ ప్రమోషన్లకు రమ్మంటే తాను రానని ముందుగానే చిత్ర బృందానికి చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ప్రమోషన్లకు రానని చెప్పినట్టు తెలుస్తోంది. కనీసం ఈ సినిమా గురించి ఈయన మాట్లాడుతున్న ఒక వీడియో క్లిప్ అయినా విడుదల చేస్తారని అందరూ భావించారు అది కూడా జరగలేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు.కన్నప్ప ఈ రోజు నుండి పెద్ద తెరపై సందడి చేయనున్నాడు. తన ప్రాణం కన్నా ఎక్కువ ఇచ్చిన వ్యక్తి ఇతిహాస కథ ఇది. కన్నప్ప ఇప్పుడు దైవిక శరణాగతి సాక్షిగా నటిస్తున్నాడు అంటూ కామెంట్ చేశాడు. ఎట్టకేలకి కన్నప్ప గురించి ప్రభాస్ స్పందించడం పట్ల చిత్ర బృందంతో పాటు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.