Deepika: బాలీవుడ్ లో దీపికా పదుకొన్ నటించిన `గెహ్రైయాన్’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది దీపికా. ఈ సినిమా ఈనెల 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో దీపికా పదుకోన్ చేసిన రొమాంటిక్ సీన్లపై రచ్చ నడుస్తోంది.
పెళ్లి తరువాత ఇలాంటి సీన్లతో నటించడం ఏమిటని కొంత మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. దీపికాపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రోమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో దీపికా పదుకోన్ తో పాటు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే లీడ్ క్యారెక్టర్లలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో దీపికా పదుకొన్ చాలా రొమాంటిక్ సీన్లలో నటించింది.
సిద్దాంత్ చదుర్వేదితో ఘాటు లిప్ లాక్ సీన్లలో, బెడ్ రూం సీన్లలో నటించింది. ప్రస్తుతం విడుదలైన ఈ సీన్లు సినీ లవర్స్ కు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రేక్షకుల మతులు పొగొడుతున్నాయి. ముఖ్యంగా గెహ్రైయిన్ సినిమాలోని ‘డూబే’ పాంగ్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ పాటలో సిద్ధాంత్ తో ఘాటు రొమాన్స్ చేసింది. ముఖ్యంగా బెడ్ రూం సీన్లతో పాటు, లిప్ లాక్ సీన్లతో సెగలు పుట్టించింది. అయితే ఇప్పుడు ఈ సీన్లపై పలువురు నెటిజెన్ల నుంచి దీపికా తీవ్రమైన కామెంట్లు, ట్రోల్స్ ఎదురుకొంటోంది.
తాజాగా.. ఓ నెటిజన్ నుంచి దీపికాకు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ సీన్లలో నటించేందుకు మీ భర్త రణ్ వీర్ సింట్ నుంచి పర్మీషన్ తీసుకున్నారా..?? అని ప్రశ్నించాడు. ఈ విషయాలను ఆయనతో చర్చించారా? అంటూ కామెంట్ చేశారు. అయితే దీపికా కూడా అంతే స్ఠాయిలో సదరు నెటిజెన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఇలాంటి ప్రశ్నలకు స్పందించడం మూర్ఖత్వమే అవుతుందని.. తన జీవితంలో నటనకు ఎంత ప్రయారిటీ ఉందో తనకు తెలుసు అని.. ఈ విషయం భర్త రణ్ వీర్ సింగ్ కు కూడా తెలుసని చెప్పింది. తాను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను అస్సలు చదవనని.. నాసినిమాల గురించి నాభర్తతో చర్చించడం మా వ్యక్తిగత విషయం అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు చేసేవారు చాలా తెలివి తక్కువ వారని.. ఇదే సమయంలో చిన్నచిన్న విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారంటూ.. నెటిజెన్ కు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం గెహ్రైయాన్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది దీపిక.