‘ఆదిపురుష్’ రిలీజ్ పైన అసంతృప్తి గా ఉన్న ప్రభాస్ అభిమానులు

ఒక్క హిట్ తో పాన్ ఇండియా గా మారిన ప్రభాస్ ఇప్పుడు ఆ ఇమేజ్ ను కాపాడుకునేందుకు చాలా కాస్త పడుతున్నాడు. సౌత్ లో ‘సాహో’ ప్లాప్ అయినా కానీ హిందీ లో మాత్రం మంచి హిట్ అయ్యింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘ఆదిపురుష్’ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి, అలాగే డైరెక్టర్ ఓం రౌత్ మొదటి సినిమా ‘తానాజీ’ హిట్ అయినందువల్ల ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్నారు. అయితే ఈ సారి ఫాన్స్ మాత్రం ‘ఆది పురుష్’ కంటే ముందు ‘సలార్’ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎలాగైనా ప్రశాంత్ నీల్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని కాబట్టి ‘ఆదిపురుష్’ కి మంచి బిజినెస్ అవుతుందని ఫాన్స్ అనుకుంటున్నారు.

రామాయణం నేపథ్యంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా మోషన్ కాప్చర్ సినిమా అని ప్రచారం సాగుతుంది, కానీ దర్శక నిర్మాతలు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.