వైరల్ : ఓంరౌత్ మతి పోయేలా “ఆదిపురుష్” కి వర్క్ చేసిన ఫ్యాన్స్.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మంచి క్రేజ్ ఉన్నటువంటి పలు భారీ చిత్రాల్లో అనేక అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న వాటిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.

ఇక ఈ చిత్రం రిలీజ్ అయితే అభిమానులు ఇచ్చిన దెబ్బకి వాయిదా పడగా జూన్ కి మళ్ళీ సినిమాని షిఫ్ట్ చేసుకున్నారు. ఇక మెయిన్ గా ఈ సినిమా విషయంలో టీజర్ చూసాక మాత్రం ఆడియెన్స్ మెయిన్ గా ఫ్యాన్స్ లో చాలా డిజప్పాయింట్మెంట్ నెలకొంది.

దీనితో అసలు ఇంత చెత్త గ్రాఫిక్స్ తో సినిమాని ఊహించలేదని వారు తేల్చి చెప్పేసారు. దీనితో ఫైనల్ గా ఈ చిత్రం మళ్ళీ ఈ గ్రాఫిక్స్ పనులు చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే వీరు ఎన్నో వందల కోట్లు పెట్టి కూడా చెత్త అవుట్ ఫుట్ ని తీసుకురాగా.

టాలెంటెడ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఈ రేంజ్ లో ఉండాలి విజువల్స్ అంటే అని కొన్ని షాట్స్ ని సూపర్ గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పంచుకోగా అవి ఇతర ఫ్యాన్స్ కి సహా జెనరల్ ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చేసాయి.

దీనితో రాముడు, రావణుడు, హనుమ పత్రాలు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా దర్శకుడు ఓంరౌత్ ని ట్యాగ్ చేసి మరీ చూపిస్తున్నారు. అయితే అవి కూడా నిజంగానే ఒరిజినల్ కన్నా చాలా బాగున్నాయి అది వేరే విషయం ఈ రేంజ్ లో కానీ ఓంరౌత్ చూపించి ఉంటే డెఫినెట్ గా ఆదిపురుష్ అంచనాలు మొదట్లోనే రీచ్ అయ్యేది.