ట్రెండింగ్ టాపిక్ : ప్రభాస్ దెబ్బ.. రజినీ పారితోషకం భారీగా పెంచేసిందా..?

ఇప్పుడు అయితే ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒప్పుకోక తప్పదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న ఒక్కో సినిమా ఎలా లేదన్నా 500 కోట్లకి పైగా బిజినెస్ చేసేదిలానే ఉంది. అందుకే నిర్మాతలు ఇప్పుడు ప్రభాస్ డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

దీనితో ప్రభాస్ కూడా తన ఫీజ్ ని హైక్ చేసాడని పలు రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా లేటెస్ట్ గా “ఆదిపురుష్” సినిమాకి గాను ఏకంగా 120 కోట్లు పారితోషకం తీసుకొని ఇండియన్ సినిమా దగ్గర భారీ రికార్డు నెలకొల్పినట్టుగా వార్తలు ప్రచారం అవుతుండగా ఈ విషయంలో మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు హర్ట్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. 

రజినీకాంత్ కి కూడా భారీ రెమ్యునరేషన్ లు ముడతాయి. సాధారణ ఫామిలీ డ్రామాలకే రజిని 100 కోట్లు తీసుకున్నారని టాక్ ఉంది. మరి ఇప్పుడు తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కి 120 కోట్లు అనే మాట వైరల్ అవుతుండడంతో తమిళ మీడియా వర్గాలు రజినీకాంత్ ఇప్పుడు… 

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న భారీ చిత్రం “జైలర్” కి గాను 142 కోట్లు తీసుకుంటున్నారని అందుకే ఇండియాలో రజినీ మాత్రమే హైయెస్ట్ పైడ్ హీరో అని వారు చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా ప్రబస్ రెమ్యునరేషన్ టాక్ తర్వాతే బయటకి వచ్చింది. మొత్తానికి అయితే ప్రభాస్ దెబ్బ మాత్రం రజిని మరియు కోలీవుడ్ వర్గాలను హర్ట్ చేసినట్టు ఉందని అనిపిస్తుంది.