ప్రభాస్ కి కథల ఎంపిక తెలియదు.. అందుకే వరుస ప్లాప్స్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన మొట్టమొదటి టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటివరకు అందరిలా టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. తాజాగా ప్రభాస్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మొదట ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి వంటి సినిమాల ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొందరు ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ గురించి అలనాటి ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ ప్రభాస్ గురించి మాట్లాడుతూ..ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు నుండే నాకు బాగా తెలుసు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఆయన కుటుంబ సభ్యులకు కూడా నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ హీరోగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ రాజమౌళి చేతిలో పడిన తర్వాత బాహుబలి సినిమా ద్వారా ఇండస్ట్రీలో చిరంజీవికి మించిన స్టార డమ్ సంపాదించుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ కి బర్రలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు . అందువల్లే ప్రభాస్ చదువులో కూడా ఎక్కువ రానించేవాడు కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా ఒక పెద్ద డిజాస్టర్. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ సినిమా కూడ మరొక పెద్ద డిజాస్టర్ అంటూ చెప్పుకొచ్చాడు. మంచి కథలు ఎంపిక చేసుకోవటం ప్రభాస్ కి రాదు. అందుకే ఇలాంటి చెత్త సినిమాలలో నటించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ గురించి గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలకు ప్రభాస్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.