Prabhas: కన్నప్ప తరహాలోనే మరో అతిథి పాత్రకు సిద్ధమైన ప్రభాస్… ఏ హీరో సినిమాలోనో తెలుసా?

Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు నటుడు ప్రభాస్. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ చేస్తూ కూడా ప్రభాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇటీవల ఈ సినిమాలో ప్రభాస్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో ప్రభాస్ లుక్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ మరో సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా రాజమౌళి డైరెక్షన్లో రాబోయే ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు తెలిసిందే అయితే గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో ప్రభాస్ బహిరంగంగా మాట్లాడుతూ డార్లింగ్ నాకు కూడా ఒక రోల్ ఇవ్వకూడదు అంటూ మాట్లాడారు. అయితే రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ప్రభాస్ కోసం ఒక స్పెషల్ పాత్ర క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందేనని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.