‘ఏజెంట్’ కోసం పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ షురూ

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఏజెంట్’. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ కొట్టి మాంచి జోరు మీదున్నాడు. దాంతో అస్సలు తగ్గేదేలే.. అన్న రీతిగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడట.

అసలే మాంచి యాక్షన్ కటౌట్ అఖిల్. ఫ్లాప్ సినిమాలైనా, అఖిల్ గత సినిమాల కోసం హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు డైరెక్టర్లు. ఇక ఇక్కడున్నది అసలే సురేందర్ రెడ్డి. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డికి మంచి పేరుంది. అఖిల్‌లాంటి కటౌట్‌తో సూరి చేయబోయే ఆ యాక్షన్ మ్యాజిక్ ఎలా ఉండబోతోందనే విషయంలో నో డౌట్స్ అందరికీ.

ప్రస్తుతం యూరోపియన్ నగరంలో భారీ నుంచి అతి భారీ యాక్షన్ ఘట్టాలు అఖిల్‌పై చిత్రీకరణ జరుగుతున్నాయి. ఇలాంటి మరికొన్ని యాక్షన్ ఘట్టాలకు సూరి ఘనంగా ప్లాన్ చేస్తున్నాడట. ‘బ్యాచ్‌లర్’తో కూల్ అండ్ లవ్లీ హీరోగా కనిపించిన అఖిల్ ‘ఏజెంట్’ కోసం పక్కా యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. అందుకు అఖిల్ బాడీ బిల్డింగే సాక్ష్యం. ఓవరాల్‌గా ‘ఏజెంట్’ ఓ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ అని అర్ధమవుతోంది. చూడాలి మరి, మన బ్యాచ్‌లర్ ‘ఏజెంట్‌’ చేయబోయే ఆ యాక్షన్ ఎలా ఉండబోతోందో.?