పవన్ కళ్యాణ్ కోసం పూజా హెగ్దే వచ్చేస్తోంది.!

మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీవివాస్ కాంబో మూవీలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోందన్న సంగతి ఎప్పుడో తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసినప్పుడే పూజా హెగ్దే హీరోయిన్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయిపోయాడు. ఎంతైనా త్రివిక్రమ్‌కి పూజా హెగ్దే లక్కీ ఛామ్ కదా. రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పూజా హెగ్దేతోనే హిట్ కొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సెంటిమెంట్‌తోనే మహేష్ సినిమాకి బుట్టబొమ్మనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశాడు దిక్కులు చూడకుండా.

కానీ, ఎక్కడ పొగ రాజిందో తెలీదు కానీ, ఈ సినిమాలో పూజా హెగ్దే నటించడం లేదంట.. అంటూ గాసిప్పులు గుప్పు గుప్పుమంటున్నాయ్ ఈ మధ్య. ఈ సినిమాకి కథతో పాటూ కాస్టింగ్ కూడా మారపోనుందట అనే ఊహాగానాల్లో భాగంగా, పూజా హెగ్దేని కూడా మార్చొచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయ్. ఇంతలోనే బుట్టబొమ్మకు మరో క్రేజీ ఆఫర్ తగిలిందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాని పక్కన పెట్టేసి, పవన్ సూచించిన మరో స్క్రిప్టును అతి త్వరలోనే హరీష్ శంకర్ పట్టాలెక్కించనున్నాడట. ఆ ప్రాజెక్ట్ కోసం పూజా హెగ్దేతో సంప్రదింపులు జరుగుతున్నాయట. దాదాపు పూజా హెగ్దే ఫిక్సయినట్లే అని తెలుస్తోంది. అంతేకాదు, మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దేకి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారనీ తెలుస్తోంది. వారెవ్వా బుట్టబొమ్మా.! నక్క తోక తొక్కావులే పో.!